: జగన్ నుంచి విడదీసే కుట్ర జరుగుతోంది: ధర్మాన ప్రసాదరావు


కొన్ని పత్రికలు పనిగట్టుకుని అవాస్తవ కథనాలను ప్రచురిస్తూ, దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి, జగన్ కు తనను దూరం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. జగన్ కడపలో మినహా మరెక్కడా గెలవలేరని, శ్రీకాకుళం పోటీ చేసిన పక్షంలో ఓడిపోతారని ధర్మాన వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, తప్పుడు వార్తలు ప్రచురించి వైకాపాను బలహీనపరిచే కుతంత్రాలు జరుగుతున్నాయని నిప్పులు చెరిగారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు అధికంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో జరిగిన అభివృద్ధి అంతా వైఎస్ చలవేనని తెలిపారు. 14 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జిల్లాకు ఒక్క పర్మినెంట్ పథకాన్ని కూడా అందించలేదని ధర్మాన ప్రసాదరావు విమర్శించారు.

  • Loading...

More Telugu News