: పోలవరం ఆలస్యానికి కారణమిదే: చంద్రబాబు
ప్రతి యేటా వరదలు వస్తున్న కారణంగానే పోలవరం నిర్మాణం ఆలస్యం అవుతోందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం పోలవరం పనులను డ్రోన్ కెమెరాతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించి సమీక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సంవత్సరం వరదల కారణంగా నెలన్నరగా పనులు నిలిచిపోయాయని అన్నారు. మరో రెండు వారాల పాటు పనులు ప్రారంభించే అవకాశాలు లేవని, సెప్టెంబర్ నుంచి వేగంగా పనులు జరుగుతాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. వరదలు వచ్చి ఆరేడు నెలల పాటు పనులు సాగడం లేదని, 'స్పిల్ వే'లను నిర్మించేందుకు వరదలే అడ్డంకిగా మారుతున్నాయని అన్నారు. వరద నీరు వెళ్లగానే పనులు ప్రారంభమవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.