: మీ ప్రశంసతో మాటలు రావడం లేదు సార్: రజనీకాంత్ కు సింధూ సమాధానం
తాను ఒలింపిక్ మెడల్ గెలిచిన తరువాత ఎందరో సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసల వర్షాన్ని కురిపించగా, పీవి సింధు ఓ ప్రశంసకు మాత్రం ముగ్ధురాలైంది. పతకం గెలిచినప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా ఉండి, ఇండియాకు వచ్చిన తరువాత రెండు రోజులపాటు స్వాగత సత్కారాలు, పుష్కరాల హడావుడిలో గడిపిన సింధూ, తన ట్విట్టర్ ఖాతా తెరచి చూసుకుని ఆశ్చర్యంలో మునిగిపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ 'నేను నీకు అభిమానిగా మారిపోయాను' అని చేసిన ట్వీట్ తో ఆనందం పట్టలేక పోయింది. దానికి స్పందిస్తూ, "థ్యాంక్యూ సో మచ్ సార్. మీ ప్రశంసతో నాకు మాటలు రావడం లేదు. నా ఆనందాన్ని వర్ణించలేను" అంటూ రీ ట్వీట్ పెట్టింది.