: తిరుపతి చేరుకున్న పవన్ కల్యాణ్.. భారీగా పోలీసు బందోబస్తు
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకున్నారు. తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి భారీ బందోబస్తు మధ్య వినోద్ ఇంటికి బయలుదేరారు. ఓ తెలుగు హీరో అభిమానుల చేతిలో హత్యకు గురైన పవన్ ఫ్యాన్ వినోద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా అభిమాని ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంతో సున్నితమైన అంశం కావడంతో అక్కడ ఎటువంటి ఉద్రిక్తత చెలరేగకుండా అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.