: గోపీచంద్ నా బెస్ట్ కోచ్... డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వ్యాఖ్యలపై నో కామెంట్: సింధు
"నా వరకూ గోపీచంద్ అత్యుత్తమ కోచ్. ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని అనుకోవడం లేదు" అని ఒలింపియన్ పీవీ సింధు వ్యాఖ్యానించింది. ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ, తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన రాగా, సింధూ స్పందించింది. గోపీచంద్ కు మించిన కోచ్ తనకు లభించబోరని, భవిష్యత్తులో సైతం అతని శిక్షణలోనే మరింత రాటుదేలతానని తెలిపింది. కాగా, "వచ్చే ఒలింపిక్స్ లో స్వర్ణం గెలిచేలా సింధుకు మరింత మంచి కోచింగ్ ఇచ్చేందుకు విదేశీ కోచ్ ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తాం" అని మహమూద్ అలీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.