: వినోద్ రాయల్ ఇంటికి క్యూ కట్టిన పవర్ స్టార్ అభిమానులు!... తిరుపతిలో హోరెత్తుతున్న నినాదాలు!


టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ అభిమానుల చేతిలో చనిపోయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ వినోద్ రాయల్ ఇంటికి జనసేన అదినేత అభిమానులు క్యూ కడుతున్నారు. వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేటి ఉదయం పవన్ కల్యాణ్ తిరుపతికి వస్తున్న విషయాన్ని నిన్న రాత్రే అందుకున్న ఆయన అభిమానులు భారీ సంఖ్యలో పోగయ్యారు. నేటి ఉదయం నిర్వహించాల్సిన కార్యక్రమాలకు సంబంధించి నిన్న రాత్రే వారు పక్కా ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో నేడు తెల్లవారగానే ఒక్కొక్కరుగా వినోద్ రాయల్ ఇంటి బాట పట్టారు. ఇప్పటికే వందలాది మంది పవన్ కల్యాణ్ అభిమానులు వినోద్ రాయల్ ఇంటికి చేరుకున్నారు. ‘జోహార్లు వినోద్ రాయల్’ అంటూ రాసిన ప్లకార్డులు పట్టుకుని వారు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News