: బ్రేకింగ్ న్యూస్... అర్థాంతరంగా ఖజకిస్థాన్ లో ల్యాండ్ అయిన ముంబై - నెవార్క్ విమానం
ఈ ఉదయం ముంబై నుంచి నెవార్క్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కజకిస్థాన్ లో ల్యాండ్ అయింది. విమానం మార్గమధ్యంలో దారిని మళ్లించినట్టు సమాచారం. ఎందుకోసం ఈ విమానం కజక్ కు దారిమళ్లిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. విమానం కజకిస్థాన్ కు డైవర్ట్ కావడంపై అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. విమానం దారిమళ్లడానికి నిర్వహణా ఇబ్బంది మాత్రమే కారణమని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.