: తిరుమలలో నడిరోడ్డుపై భక్తులను హడలెత్తించిన కొండచిలువ!


తిరుమలలో ఈ ఉదయం దారితప్పి నడిరోడ్డుపైకి వచ్చిన కొండచిలువ భక్తులను హడలెత్తించింది. అధిక సంఖ్యలో భక్తులు సంచరిస్తుండే గరుడాద్రి నగర్ దగ్గర్లోని దివ్యారామం వద్ద, ఓ కప్పను మింగిన కొండచిలువ కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. పాములను పట్టుకోవడంలో నిపుణుడైన మునిస్వామిని పిలిపించిన అధికారులు దీన్ని చాకచక్యంగా బంధించారు. దాదాపు 12 అడుగులకు పైగా పొడవున్న ఈ కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని మునిస్వామి తెలిపాడు. అంతకు కొద్దిసేపటి క్రితమే ఆహారాన్ని తీసుకున్న కారణంగా ఇది వడివడిగా కదల్లేని స్థితిలో ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News