: అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ పై ముష్కరుల దాడి
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోని అమెరికా యూనివర్శిటీ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ లోకి ముష్కరులు ఈరోజు రాత్రి చొరబడ్డారు. బాంబులు పేల్చుతూ, కాల్పులకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అధ్యాపకులు, కొంతమంది విద్యార్థులు యూనివర్శిటీ లోపలే చిక్కుకుపోయారు. ముష్కరులను మట్టుబెట్టేందుకు ప్రభుత్వ భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. యూనివర్శిటీ క్యాంపస్ లోపల చిక్కుకున్న అధ్యాపకులు, విద్యార్థులు భయాన్ని వ్యక్తం చేస్తూ తమ మిత్రులకు మెసేజ్ లు పెడుతుండటం గమనార్హం.