: యువ క్రికెటర్లను జట్టులోకి తీసుకోవాలంటే సెలెక్టర్ల లైంగిక వాంఛలు తీర్చాలట!
యువ క్రికెటర్లను జట్టులోకి తీసుకోవాలంటే బీసీసీఐ సెలెక్టర్ల లైంగిక వాంఛలు తీర్చాలంటూ లోథా కమిటీ కార్యదర్శి గోపాల్ శంకర నారాయణన్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణలను బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే, బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కు మెయిల్ చేశారు. ఈ నెల 9న జస్టిస్ లోథా ప్యానల్ తో జరిగిన సమావేశానికి అజయ్ షిర్కే ఒక్కరే హాజరయ్యారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు, బీసీసీఐ సెలెక్టర్ల అవినీతి, అక్రమాలు, బీసీసీఐ ఉదాసీన వైఖరిపై గోపాల్ శంకర్ నారాయణన్ చేసిన ఆరోపణలను అనురాగ్ ఠాకూర్ కు అజయ్ షిర్కే మెయిల్ చేశారు. యువ క్రికెటర్లను జట్టులోకి తీసుకోవాలంటే వారి తల్లులు తమ లైంగిక వాంఛలు తీర్చాలంటూ సెలెక్టర్లు కోరుతున్నారని, వారు తప్పు చేస్తున్నప్పటికీ బీసీసీఐ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని గోపాల్ శంకర్ నారాయణన్ ప్రశ్నించారని, ఇటువంటి విషయాలు తమ దృష్టికి ఎప్పుడూ రాలేదని గోపాల్ శంకర్ నారాయణన్ కు చెప్పానని అజయ్ షిర్కే ఆ మెయిల్ లో పేర్కొన్నారు.