: సమంత సాయంతో చిన్నారికి శస్త్రచికిత్స
దక్షిణాది సినీ కథానాయిక సమంత తన గొప్ప మనసును మరో మారు చాటుకుంది. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న నిరుపేద చిన్నారి చాందినికి రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో సమంత శస్త్ర చికిత్స చేయించింది. ఈ సందర్భంగా సమంత ఆ ఆసుపత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించింది. ఈ మేరకు సమంత ఒక ట్వీట్ చేసి, ఫొటోను పోస్ట్ చేసింది. ఈ విషయంలో తనకు సహకారమందించిన మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రికి, డాక్టర్ మంజులకు కృతజ్ఞతలని, ఈరోజు చాలా సంతోషకరమైన రోజని, చాందిని ఆరోగ్యంగా ఉందని ఆ ట్వీట్ లో పేర్కొంది. కాగా, వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న చిన్నారులకు ప్రత్యూష ఆర్గనైజేషన్ పేరిట సమంత ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.