: నాది 'భారతీయ' కులం... నజరానాగా వచ్చిన డబ్బుతో ఏం చేయాలో ఇంకా ఆలోచించలేదు: సింధు


సోషల్ మీడియాలో తన కులంపై వస్తున్న పోస్టులపై ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు స్పందించింది. తన కులం భారతీయ కులం అని తెలిపింది. ఈ కులాల సంగతి తనకు తెలియదని చెప్పింది. తాను భారతీయురాలినని చెప్పింది. తాను ఒక కులానికి చెందిన దానిని కానని, మొత్తం దేశానికి చెందినదానినని పేర్కొంది. తనకు నజరానాగా వచ్చిన మొత్తంతో ఏం చేయాలన్న ఆలోచన లేదని తెలిపింది. ప్రస్తుతానికి తాను విజయాన్ని ఆస్వాదిస్తున్నానని సింధు చెప్పింది. తనను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది. విమర్శలను తాను పట్టించుకోనని సింధు చెప్పింది. ఇప్పుడు తనకు లభిస్తున్న ప్రశంసలను ఆస్వాదిస్తున్నానని చెప్పింది. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే తనలాగే అందరూ పతకాలు సాధిస్తారని చెప్పింది. వచ్చే ఒలింపిక్స్ వరకు పతకం కోసం ఆగడం కంటే... అంతకు ముందు చాలా టోర్నీలు ఉన్నాయని, వాటిల్లో సాధించాల్సినది చాలా ఉందని చెప్పింది.

  • Loading...

More Telugu News