: మా నాన్నను ఇప్పుడు 'సింధు ఫాదర్' అంటున్నారు: సింధు
తన తండ్రి ప్రముఖ వాలీబాల్ క్రీడాకారుడు కావడంతో తనను గతంలో పీవీ రమణ కూతురనేవారని, కానీ, ఇప్పుడు మాత్రం, 'సింధు ఫాదర్ పీవీ రమణ' అంటున్నారని, ఇదో కొత్త అనుభూతి అని ప్రముఖ షట్లర్ సింధు నవ్వులు చిందిస్తూ చెప్పింది. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించడాన్ని ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నానని, తన తల్లిదండ్రులతో పాటు కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ఎంతో కష్టపడ్డారని చెప్పింది.