: నీళ్లంటే నాకిష్టముండేది కాదు: దిగ్గజ స్విమ్మర్ ఫెల్ప్స్
ఈత కొలనులో చెలరేగిపోయే అమెరికా దిగ్గజ స్మిమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రియో ఒలింపిక్స్ లో 5 స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించిన ఫెల్ప్స్ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. నీళ్లంటే తనకు ఇష్టముండదని, కానీ, చిన్నప్పుడు తన తల్లి తనను జాగ్రత్తగా స్విమ్మింగ్ పూల్ లోకి దింపేదని చెప్పాడు. నీళ్లంటే తనకు ఇష్టంలేని కారణంగా, ఏమీ చేయకుండా, నీళ్లలో అలాగే నిలబడిపోయేవాడినని ... ఆ తర్వాత నెమ్మదిగా వెనక్కి ఈదడం నేర్చుకున్నానంటూ చెప్పుకొచ్చాడు.