: కాంగ్రెస్, టీడీపీ కంపెనీలు చిప్పకూడు తినడానికి సిధ్దంగా వుండాలి!: కేసీఆర్ హెచ్చరికలు
కాంగ్రెస్, టీడీపీ కంపెనీలు ముసుగులు తొలగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మహారాష్ట్రతో సాగునీటి ఒప్పందాలు చేసుకున్న అనంతరం హైదరాబాదు చేరిన ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కంపెనీలు ముసుగులు తొలగించి, రాష్ట్రాభివృద్ధికి పాటు పడాలని అన్నారు. లేని పక్షంలో జైళ్లలో చిప్పకూడు తింటారని ఆయన హెచ్చరించారు. లేనిపోని విమర్శలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమని, కేసులు పెడతామని ఆయన అన్నారు. మళ్లీ లేని పోని విమర్శలతో బురద జల్లితే బిడ్డా! జైల్లో చిప్పకూడే మీకు దిక్కు అని ఆయన హెచ్చరించారు.