: ఆర్ఎస్ఎస్ ను రాహుల్ గాంధీ ఏమీ అనలేదు...కార్యకర్తలను మాత్రమే విమర్శించారు: సుప్రీంకు కపిల్ సిబాల్
మహాత్మా గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమని రాహుల్ గాంధీ ఎప్పుడూ అనలేదని ఆయన తరఫు న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పై ఎప్పుడూ ఆరోపణలు చేయలేదని, ఆర్ఎస్ఎస్ కు చెందిన కార్యకర్తలపై మాత్రమే ఆయన ఆరోపణలు చేశారని ఆయన సుప్రీంకోర్టుకు చెప్పారు. దీనికి సంబంధించిన అఫిడవిట్ ను ఆయన సుప్రీంకోర్టుకు సమర్పించారు. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ ను అవమానించలేదని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడి, తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. కాగా, మహాత్మాగాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమని రాహుల్ గాంధీ పేర్కొన్నారంటూ ఆ సంస్థ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.