: హర్యానాలో ‘బేటీ బచావో, బేటీ పడావో’ బ్రాండ్ అంబాసిడర్ గా సాక్షిమాలిక్


రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్ ను హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. అలాగే, హర్యానా ప్రభుత్వం తరపున ‘బేటీ బచావో, బేటీ పడావో’ పథకం ప్రచార కార్యక్రమానికి సాక్షిమాలిక్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. సాక్షి మాలిక్ సన్మాన సభలో పాల్గొన్న హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా, ఒలింపిక్స్ విజేతగా నిలిచిన సాక్షి మాలిక్ కు రూ.2.5 కోట్ల చెక్ ను ఆయన అందజేశారు.

  • Loading...

More Telugu News