: అమెరికా చేరుకున్న టీమిండియా!


టీమిండియా అమెరికా చేరుకుంది. విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా అమెరికా ఎందుకు వెళ్లిందన్న అనుమానం వచ్చిందా? క్రికెట్ ఆడడానికే. విండీస్ టూర్ లో భాగంగా ఆ జట్టుతో టీమిండియా రెండు టీ20 మ్యాచ్ లు ఆడాల్సిఉంది. ఈ రెండు మ్యాచ్ లకు అమెరికాలోని సెంట్రల్ బ్రొవార్డ్ రీజినల్ పార్క్ వేదికగా నిలవనుంది. దీంతో ఈ నెల 27, 28 తేదీలలో రెండు టీ20 మ్యాచ్ లు ఆడనున్నారు. దీంతో టీమిండియా ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన కోహ్లీ అమెరికా చేరుకోవడంపై ఆనందం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News