: సహజీవనం చేసేవారికి, స్వలింగ సంపర్కులకు అద్దెగర్భం ద్వారా సంతానం పొందే హక్కు లేదు: సుష్మాస్వరాజ్
అద్దెగర్భం ముసాయిదా బిల్లుకు ఈరోజు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అద్దెగర్భం (సరోగసీ) ద్వారా జన్మించిన సంతానంపై తల్లిదండ్రులకు చట్టబద్ధమైన అధికారం ఉంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మీడియాతో మాట్లాడుతూ, అద్దె గర్భం ద్వారా సంతానం పొందడానికి ఎవరెవరికి హక్కు ఉండబోదో వివరించారు. ఆ వివరాల ప్రకారం.. * సహజీవనం చేసేవారు, స్వలింగ సంపర్కులకు అద్దెగర్భం ద్వారా సంతానం పొందేహక్కు లేదు * జీవిత భాగస్వామి లేని, పెళ్లి కాని వారికి అద్దెగర్భం ద్వారా సంతానం పొందే హక్కు లేదు * విదేశీయులు, ప్రవాస భారతీయులకు అద్దెగర్భం ద్వారా సంతానం పొందే హక్కు లేదు * ఇప్పటికే సంతానం ఉన్నవారికి కూడా అద్దెగర్భం ద్వారా సంతానం పొందే హక్కు లేదు.