: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈరోజు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 70 పాయింట్లు లాభపడి 28,059 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు లాభపడి 8,650 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈ లో అరబిందో ఫార్మా, టాటాపవర్, మారుతి సుజుకీ, సిప్లా, జీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు లాభపడ్డాయి. కాగా, అంబుజా సిమెంట్, టాటా మోటార్ (డి), టాటా స్టీల్, ఐడియా, లుపిన్ సంస్థల షేర్లు నష్టపోయాయి.