: 'వడాపావ్ డే' స్పెషల్...145 అడుగుల వడాపావ్
మహారాష్ట్రలో ప్రధానంగా ముంబైలో వడాపావ్ కు ఉన్న పేరు మరే ఇతర వంటకానికి లేదంటే అతిశయోక్తి కాదు. హైదరాబాదు బిర్యానీ ఎంత ఫేమస్సో, వడాపావ్ కూడా అంతే ఫేమస్. ముంబైలోని ఇంచుమించు ప్రతి గల్లీలో వడాపావ్ దొరుకుతుంది. దీనిని అమ్మి ఎంతో మంది కోట్లు గడించారని ముంబైలో చెబుతుంటారు. అలాంటి వడాపావ్ డేను గూర్గావ్ లోని ప్రముఖ చైన్ రెస్టారెంట్స్ నూక్కడ్ వాలా ఘనంగా నిర్వహించింది. ఏకంగా 145 అడుగుల వడాపావ్ ను తయారు చేశారు. ఇప్పటి వరకు ఇదే ప్రపంచంలో అతి పెద్ద వడాపావ్. దీనిని చెఫ్ అజయ్ సూద్ ఆధ్వర్యంలోని 25 మంది సభ్యుల టీమ్ మూడు రోజులు శ్రమించి తయారు చేసింది. దీని తయారీలో 200 కేజీల బంగాళా దుంపలు, బ్రెడ్ వినియోగించారు. కేవలం మూడు గంటల్లేనే దీనిని ఫైనల్ ప్లేటింగ్ చేసి రికార్డు సృష్టించారు. దీనిని 2,500 మంది లొట్టలేసుకుంటూ ఆరగించారని నూక్కడ్ వాలా సంస్థ తెలిపింది. ఈ భారీ వడాపావ్ 2018 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తమకు స్థానం కల్పిస్తుందని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.