: రాంచరణ్ కు రాఖీ కట్టిన పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె
వారం రోజుల క్రితం రక్షాబంధన్ వేడుకలను సామాన్య పౌరుల నుంచి సెలెబ్రిటీల వరకు ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలను మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కూడా ఘనంగా జరుపుకున్నాడు. తన సోదరీమణులు నిహారిక, శ్రీజ, సుస్మితా లు రాంచరణ్ కు రాఖీలు కట్టారు. వీరితోపాటు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిన్న కూతురు పొలినా కూడా అన్నయ్య రాంచరణ్ కు రాఖీ కట్టింది. ఈ విషయాన్ని స్వయంగా రాంచరణే తన ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల ద్వారా తెలిపాడు. దీంతోపాటు ఒక కొలేజ్ ను రాంచరణ్ తన అభిమానుల కోసం పోస్ట్ చేశాడు. ‘నా సోదరీమణులు.. నా సంతోషం..ఆ రాఖీ పండగ మరపురాని రోజు’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో చెర్రీ పేర్కొన్నాడు.