: కత్తులు తిన్న ఖాకీ!... కానిస్టేబుల్ కడుపులో నుంచి 40 కత్తులను తీసేసిన వైద్యులు!
వింత వ్యాధితో బాధపడుతున్న ఓ కానిస్టేబుల్ రెండు నెలల క్రితం ఏకంగా 40 కత్తులను తినేశాడు. ఆ కానిస్టేబుల్ తిన్న కత్తులను ఐదుగురు సభ్యుల వైద్య బృందం ఆపరేషన్ చేసి తీసేసింది. ఈ ఘటన పంజాబ్ లో వెలుగుచూసింది. 42 ఏళ్ల వయస్సున్న ఆ కానిస్టేబుల్ ఓ వింత వ్యాధితో బాఢపతున్నాడట. ఈ క్రమంలో అతడు కనిపించిన బ్లేడ్లు, కత్తులను లాగించేశాడు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన అతడికి 5 గంటల పాటు ఆపరేషన్ చేసిన వైద్యులు ఆ కత్తులన్నింటిని తీసేశారు. ఈ ఆపరేషన్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం జాతీయ మీడియాలోకి వచ్చేసింది. కడుపులోని కత్తులను వైద్యులు తొలగించిన తర్వాత ప్రస్తుతం అతడు పంజాబ్ లోని ఓ ఆసుపత్రిలో మెల్లగా కోలుకుంటున్నాడు.