: కోరుట్లలో జాతీయ రహదారి దిగ్బంధం.. రెండు గంటలుగా స్తంభించిన రాకపోకలు
కరీంనగర్ జిల్లా కోరుట్లను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంతవాసులు ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ర్యాలీగా వెళ్లి అక్కడి జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. రహదారిపైనే బైఠాయించి రెండు గంటలుగా తమ నిరసనను తెలుపుతున్నారు. దీంతో ఆ రహదారి గుండా రాకపోకలు ఆగిపోయాయి. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ డిమాండుపై హామీ ఇవ్వాలని ఆందోళనకారులు పట్టుబడుతున్నారు.