: బీజేపీ కార్యకర్తల ఆందోళనతో లక్నోలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఈరోజు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడి పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో కార్యకర్తలు రెచ్చిపోయి పోలీసులపై రాళ్లు రువ్వారు. వాటర్ కెనాన్లను ప్రయోగించిన పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే యూపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని కార్యకర్తలు నినాదాలు చేశారు.