: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 4009 పోస్టులకు ఏపీపీఎస్సీ పచ్చజెండా
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇటీవలే ఉద్యోగాలకు తొలి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరో 4009 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పచ్చజెండా ఊపింది. విశాఖపట్నంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ఈరోజు ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. కానీ ఏ విభాగంలో ఈ పోస్టులు భర్తీ చేస్తారో తెలపలేదు. ప్రతి సంవత్సరం పరీక్షల ఇయర్ క్యాలెండర్ విడుదల చేస్తామని, పరీక్షలు ఆన్ లైన్ పధ్ధతిలోనే ఉంటాయని ఉదయ్ భాస్కర్ తెలిపారు. దీనివల్ల పారదర్శకంగా పరీక్షలు నిర్వహించే వీలుంటుందని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ విషయంలో గతంలో జరిగిన కోర్టు కేసులను పరిగణనలోకి తీసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.