: తల్లిని కాబోతున్నందుకు ఎంతో గ‌ర్విస్తున్నా!: కరీనా కపూర్‌


త‌న‌ అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న బాలీవుడ్ భామ, సైఫ్‌ అలీ ఖాన్ భార్య‌ కరీనా కపూర్‌ త్వరలో తల్లి కాబోతోంది. ఈ విష‌యాన్ని సైఫ్‌ అలీ ఖాన్, క‌రీనా క‌పూర్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, క‌రీనా క‌పూర్ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చాక సినిమాల్లో న‌టిస్తుందా? న‌టిస్తే ఎటువంటి క‌థ‌ల‌ను ఎన్నుకుంటుంది? హీరోయిన్ పాత్ర‌ల‌లో ఎప్ప‌టిలాగే ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుందా? అనే ప్ర‌శ్న‌లు ఆమె అభిమానులను వెంటాడుతున్నాయి. దీంతో ఈ అమ్మ‌డు తాజాగా స్పందించింది. తాను అందరిలాగే సాధారణ మహిళలా త‌న పనిలో తాను నిమ‌గ్న‌మ‌వుతాన‌ని కరీనా చెప్పింది. అందులో ఎటువంటి తప్పూ ఉండ‌బోదు కదా.. అని పేర్కొంది. త‌న పనిని తాను ఇష్టపడతాన‌ని చెప్పింది. తాను త‌న‌ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నటిని అవ్వాలనుకున్న‌ట్లు చెప్పి అతిశయం ఒలకబోసింది. త‌న‌కు 80 ఏళ్లు వచ్చే వరకు త‌న సినీ న‌ట‌నా జీవితాన్ని కొన‌సాగిస్తూనే ఉంటాన‌ని తెలిపింది. ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయగలనని పేర్కొంది. నెలలు నిండుతున్న త‌న‌ కడుపును వెండితెరపై దాచిపెట్టబోన‌ని కరీనా తెలిపింది. తాను తల్లిని కాబోతున్నందుకు ఎంతో గ‌ర్విస్తున్నాన‌ని చెప్పింది. గ‌ర్భం దాలిస్తే అందులో దాచుకోవడానికి ఏమీలేదని పేర్కొంది. తాను ఏ సినిమా ఎంపిక చేసుకున్నా త‌న‌ను అభిమానులు తానుగానే చూస్తార‌ని చెప్పింది. ప్రస్తుతం తాను కాల్షీట్లపై కసరత్తులు కొన‌సాగిస్తున్న‌ట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News