: ఖమ్మం జిల్లాలో విషాదం.. కిడ్నీ సమస్యల బారినపడ్డ 30 మంది.. ఇప్పటికి ఆరుగురు మృతి
ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట మండలం మల్లాయి గూడెంలో ఏకంగా 30 మంది గ్రామస్తులు కిడ్నీ సమస్యలతో బాధపడుతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. కిడ్నీ సమస్య బారినపడి పదిరోజులుగా ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సీతమ్మ(52) అనే గిరిజన మహిళ మృతి చెందింది. కిడ్నీ సమస్యతో ఇప్పటికే ఐదుగురు బాధితులు మృతి చెందారు. తాజాగా మరో బాధితురాలు మృతి చెందడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. భారీ సంఖ్యలో గ్రామస్తులు కిడ్నీ సమస్యల బారిన పడుతుండడం కలకలం రేపుతోంది. దీన్ని గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది.