: థాయ్ ల్యాండ్ లో వరుస బాంబు పేలుళ్లు!... ఒకరి మృతి, 30 మందికి గాయాలు!


ప్రపంచంలో బాంబు పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. థాయ్ ల్యాండ్ లో కొద్దిసేపటి క్రితం వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆ దేశంలోని పట్టాని ప్రావిన్స్ కు చెందిన ఓ హోటల్ వద్ద ఉన్నట్టుండి బాంబులు పేలాయి. ఈ పేలుడు ధాటికి ఓ వ్యక్తి చనిపోగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుడు ఆ దేశంలో పెను కలకలమే రేపింది. ప్రపంచంలోని పలు దేశాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఈ పేలుడు ధాటికి థాయ్ ల్యాండ్ వణికిపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News