: స్విస్ ఛాలెంజ్ పై దాగుడుమూతలకు చెల్లు!... సింగపూర్ కన్సార్టియం రిజర్వ్ ధర వెల్లడికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
స్విస్ ఛాలెంజ్ వ్యవహారంలో దాగుడుమూతల వైఖరికి ఏపీ సర్కారు స్వస్తి చెప్పింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిన్న రాత్రి విజయవాడలో అధికారులతో కీలక భేటీ సందర్భంగా సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో ఆదాయం పంపిణీకి సంబంధించి సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదించిన రిజర్వ్ ధర వెల్లడికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఈ రిజర్వ్ అందరికీ కాకుండా టెండర్లలో పాలుపంచుకునే సంస్థలకు మాత్రమే తెలియజేసేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సింగపూర్ రిజర్వ్ ధరను పరిశీలించిన తర్వాత తమ తమ ప్రైస్ బిడ్లను దాఖలు చేసుకునే వెసులుబాటు ఆయా కంపెనీలకు లభించినట్లైంది. వెరసి అమరావతి ఆదాయంలో ప్రభుత్వానికి మరింత మెరుగైన వాటా దక్కే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది.