: తెలుగు రాష్ట్రాల సీఎస్ ల పదవీ కాలం పొడిగింపు!... గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం!
రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న సత్యప్రకాశ్ టక్కర్, రాజీశ్ శర్మలు మరో మూడు నెలల పాటు అవే పదవుల్లో కొనసాగనున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. టక్కర్, రాజీవ్ శర్మల పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు... వారి సర్వీసులను మరో మూడు నెలల పాటు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ రెండు లేఖలపై సానుకూలంగా స్పందించిన కేంద్రం... టక్కర్, రాజీవ్ శర్మల పదవీ కాలాన్ని పొడిగించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు మరో రెండు, మూడు రోజుల్లోనే అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి.