: ‘మహా’ ఒప్పందంతో తిరిగొస్తున్న కేసీఆర్!... బేగంపేటలో ఘన స్వాగతానికి భారీ ఏర్పాట్లు!


మహారాష్ట్ర ప్రభుత్వంతో గోదావరి, పెన్ గంగ నదులపై మూడు ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఒఫ్పందం కుదుర్చుకుంది. నిన్న ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ ల సమక్షంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. యావత్తు తెలంగాణ సాగు నీటి కష్టాలకు ఈ మూడు ప్రాజెక్టులతో చెక్ పడుతుందని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర సర్కారుతో కీలక ఒప్పందం చేసుకుని తిరిగి హైదరాబాదు వస్తున్న కేసీఆర్, ఆయన కేబినెట్ లోని కీలక శాఖల మంత్రులకు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. నేటి మధ్యాహ్నం ముంబైలో బయలుదేరనున్న కేసీఆర్ బృందం... 2 గంటలకు హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానుంది. ఈ సందర్భంగా వారికి స్వాగతం చెప్పేందుకు ఎయిర్ పోర్టులో ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరిగాయి.

  • Loading...

More Telugu News