: నయీం సినీ లింకులపై ఆరాతీస్తున్న సిట్ అధికారులు
గ్యాంగ్ స్టర్ నయీం దందాపై ఏర్పాటు చేసిన సిట్ అధికారులు అతనికి సినీ పరిశ్రమతో ఉన్న లింకులపై ఆరాతీస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఓ స్టార్ హీరో సినిమాకి నయీం పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే ఓ క్రైం స్టోరీకి కథ, స్క్రీన్ ప్లే కూడా అందించినట్టు తెలుస్తోంది. దీనికి తోడు నట్టి కుమార్ ఆరోపించినట్టు యువతులతో గడపడం నయీం వీక్ నెస్ అని, దానిని అవకాశంగా చేసుకున్న పలువురు వ్యక్తులు అతనికి కావాల్సింది అతనికి సరఫరా చేసి, వీరికి కావాల్సిన పెట్టుబడులు పొందారంటూ వచ్చిన ఆరోపణలపై సిట్ సమాచారం సేకరిస్తోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన సిట్ అధికారులు పలువురి నుంచి సమాచార సేకరణలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు వ్యక్తులు భయంతో బిక్కచచ్చిపోయారని, దీనిపై ఫిల్మ్ నగర్ లో జోరుగా చర్చ నడుస్తోందని సమాచారం.