: భారత అథ్లెట్ సుధా సింగ్ కు జికా వైరస్ కాదు... స్వైన్ ఫ్లూ


రియో ఒలింపిక్స్ లో పాల్గొని తిరిగొచ్చిన భారత అథ్లెట్ సుధా సింగ్ కు జికా వైరస్ లేదని, ఆమె స్వైన్ ఫ్లూ తో బాధపడుతోందని వైద్యులు నిర్ధారించారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆమెకు జికా వైరస్ సోకిందేమోనని అనుమానించామని, అయితే, అటువంటిదేమీ లేదని బెంగళూరు వైద్యులు తెలిపారు. స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న సుధకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని డాక్టరు హర్షవర్థన్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని చెప్పారు.

  • Loading...

More Telugu News