: నన్ను క్షమించండి...మీ ఆశలు వమ్ము చేశాను: యోగేశ్వర్ దత్


ప్రముఖ రెజ్లర్ యోగేశ్వర్ దత్ దేశ ప్రజలను క్షమాపణలు కోరారు. ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో ముచ్చటించిన యోగేశ్వర్ దత్ రియో ఒలింపిక్స్ ప్రదర్శనతో దేశ ప్రజలందర్నీ నిరాశకు గురి చేశానని అన్నాడు. ఈ ఓటమితో తన కెరీర్ ముగిసిపోలేదని, గతంలో దేశం కోసం ఆడి గెలిచానని, కొన్నిసార్లు ఓటమిపాలయ్యానని గుర్తు చేశాడు. ప్రతి రోజూ విజయం రాదని, అలాగే ప్రతి రోజూ ఓటమి పలకరించదని ఆయన చెప్పాడు. తనపై విమర్శలు చేసేవారు చేస్తుంటారని, అదే సమయంలో తనను ప్రోత్సహించేవారు కూడా ఉన్నారని, వారికోసం తాను వివరణ ఇస్తున్నానని ఆయన తెలిపాడు. భవిష్యత్ లో దేశప్రజలందర్నీ తలెత్తుకుని నిలిచేలా చేస్తానని తెలిపాడు. ఈ ఓటమి తనలో కూడా నిరాశను నింపిందని ఆయన తెలిపాడు.

  • Loading...

More Telugu News