: కమలహాసన్ కు అభినందనలు తెలిపిన కేరళ సీఎం


ఫ్రాన్స్ దేశపు ‘చెవాలియర్ అవార్డు’కు ఎంపికైన ప్రముఖ నటుడు కమలహాసన్ కు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమల్ కు ఆయన ఒక లేఖ రాశారు. చిత్ర రంగ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. తన నటన ద్వారా భారతీయ చిత్ర పరిశ్రమ గొప్పదనాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేస్తున్నందుకు గాను కమల్ ను ఈ అవార్డు వరించిందని ఆ లేఖలో పినరయి విజయన్ పేర్కొన్నారు. కాగా, తమిళ నటుడు శివాజీ గణేశన్ తర్వాత ఈ అవార్డుకు ఎంపికైన రెండో తమిళ నటుడు కమల్ కావడం విశేషం.

  • Loading...

More Telugu News