: సింధు చేతులు ఆటలాడాలి... మన చేతులు ప్రార్థించాలి : రైల్వే మంత్రి సురేశ్ ప్రభు
‘సింధు చేతులు ఆటలాడాలి.. మన చేతులు ఆమె విజయం కోసం ప్రార్థించాలి’ అని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. కృష్ణా పుష్కరాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ విజేత సింధు కుటుంబ సభ్యులను, కోచ్ పుల్లెల గోపీచంద్ కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. సీఎం చంద్రబాబు ప్రసంగించడానికి ముందుగా సురేశ్ ప్రభు మాట్లాడుతూ, ‘నేను తెలుగు బిడ్డను కాదు... దత్తత తీసుకున్న తెలుగు బిడ్డను’ అని అన్నారు. 'రైల్వే శాఖ ఎంప్లాయి అయిన సింధు తండ్రి తమ కుటుంబ సభ్యుడే'నంటూ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సమయస్ఫూర్తితో మాట్లాడారు.