: 10 కోట్ల కంటే ఎక్కువుంటే రాసిచ్చేస్తా: నట్టి కుమార్ ఆరోపణలపై జగ్గిరెడ్డి
తన వద్ద 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తులుంటే రాసిచ్చేస్తానని నయీం అనుచరుడుగా నిర్మాత నట్టి కుమార్ ఆరోపించిన జగ్గిరెడ్డి తెలిపాడు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖపట్టణాల్లోని కొన్ని సినిమా ధియేటర్లలో క్యాంటీన్లు నడుపుతున్నానని వెల్లడించారు. నట్టి కుమార్ కు అనకాపల్లిలోని రాజా ధియేటర్ యాజమాన్యంతో వివాదం ఉండడంతో తాను ఫోన్ చేసి అడిగానని జగ్గిరెడ్డి తెలిపారు. అతనికి డబ్బులు ఎగ్గొట్టేందుకే నట్టి కుమార్ ఇప్పుడు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. తనకు నయీం ఎవరో తెలియదని ఆయన అన్నారు. టీవీ వార్తల్లో నయీం గ్యాంగ్ స్టర్ అని చూశానని ఆయన పేర్కొన్నారు. అలాగే తనకు మంత్రి అచ్చెన్నాయుడుతో కూడా సంబంధం లేదని ఆయన తెలిపారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు తాను విశాఖలోనే అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.