: ప్రత్యేకహోదాపై రాజీ పడే ప్రసక్తే లేదు..పోరాటం కొనసాగుతుంది!: చంద్రబాబు
ఏపీకి ప్రత్యేక హోదాపై రాజీపడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా పుష్కరాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదేే తన లక్ష్యమని, నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేస్తానని అన్నారు. మన రాష్ట్రాన్ని శక్తిమంతంగా చేయడానికి ప్రతిఒక్కరి సహకారం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. మట్టిలో మాణిక్యాలెందరో ఉన్నారని, సింధు మొన్నటి వరకు సాధారణ ఆడబిడ్డ అని, నేడు అంతర్జాతీయ స్థాయిలో కీర్తి సంపాదించిందని, దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసిందని చంద్రబాబు అన్నారు.