: కృష్ణమ్మకు ఘన హారతి
కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. పుష్కర ఘాట్ వద్ద ముగింపు వేడుకలు ఏర్పాటు చేయగా, సంగమం వద్ద ఏర్పాటు చేసిన హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ హారతి కార్యమంలో ప్రత్యేక అతిథులుగా పీవీ సింధు, పుల్లెల గోపీచంద్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారిని తన వాహనంలో పుష్కర ఘాట్ కు తీసుకుని రావడం విశేషం.