: సెంచరీలు ఆనందాన్నివ్వవు...5 వికెట్ల ఫీటే ముద్దు!: స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్


సెంచరీలు ఆనందాన్నివ్వవని టీమిండియా స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ తెలిపాడు. విండీస్ టూర్ లో రెండు సెంచరీలు చేసి సత్తా చాటిన అశ్విన్, రెండుసార్లు 5 వికెట్ల ఫీట్ కూడా సాధించాడు. అయితే, సెంచరీల కన్నా తనకు ఇలా 5 వికెట్ల ఫీట్ సాధించడం అన్నదే ఎంతో ఆనందాన్నిస్తుందని తెలిపాడు. అలాగే ఆరో స్థానంలో వచ్చి సెంచరీ సాధించడం కూడా చిన్న విషయం కాదని చెప్పాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలవడం సంతోషంగా ఉందని అన్నాడు. జట్టు సిరీస్ గెలుచుకోవడం మరింత ఆనందాన్నిచ్చిందని అశ్విన్ తెలిపాడు. ఇలాంటి మరిన్ని సిరీస్ లు ఆడి మంచి ప్రదర్శన చేయాలని కోరుకుంటానని అశ్విన్ చెప్పాడు.

  • Loading...

More Telugu News