: పదిరోజుల గడ్డానికి మగువలు పడిపోతార్ట


అమ్మాయిలు మోజు పడాలంటే.. గడ్డం ఉంటే మంచిదా? నున్నటి షేవింగ్‌ బెటరా? అనే మీమాంస కుర్రకారు గుండెల్ని ప్రతిసారీ తొలిచేస్తూ ఉంటుంది. షేవింగ్‌ క్రీములకు మాత్రమే ప్రకటనలు అవసరం గనుక.. టీవీలు మనకు నిత్యం క్లీన్‌షేవ్‌ బుగ్గల కుర్రాడి మీదకు అమ్మాయిలు ఎగబడుతున్నట్లు చూపిస్తుంటాయి. అయితే బాహ్యప్రపంచంలో కుర్రాళ్లు మాత్రం.. పొడి గడ్డంతో అమ్మాయిల్ని వెంటేసుకుని తిరుగుతుంటారు. ఈ విషయం నిగ్గు తేల్చడానికి ఆస్ట్రేలియాలో ఏకంగా ఓ పరిశోధనే జరిగింది.

న్యూసౌత్‌ వేల్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు పదిమంది పురుషుల ను క్లీన్‌ షేవ్‌ తర్వాత.. వేర్వేరు రోజుల్లో వివిధ ఫోటోలు తీశారు. అంటే.. క్లీన్‌ షేవ్‌ ఉండగా, అయిదు రోజుల గడ్డంతో, పది రోజుల గడ్డంతో మూడు దశలుగా ఫోటోలు తీశారు. వీరి చిత్రాల్ని మగువలకు చూపించినప్పుడు.. పదిరోజుల గడ్డంతో ఉన్న పురుషుల ఫోటోలే ఆకర్షణీయంగా ఉన్నట్లు వారు వెల్లడించార్ట. అయిదు రోజుల గడ్డం వారికి అసలు నచ్చలేదట. ఈ స్టడీ వివరాలు మొత్తం. స్థానికంగా మెడికల్‌ డెయిలీ డాట్‌ కాం వెల్లడించింది.

  • Loading...

More Telugu News