: సింధు కష్టానికి ప్రతిఫలం లభించింది: గోపీచంద్


ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందని ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ తెలిపాడు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, సింధు దేశానికి కీర్తితెచ్చిందని అన్నాడు. రజతపతకం సాధించడం ద్వారా క్రీడల్లో మహిళలు అద్భుతాలు చేయొచ్చని సింధు నిరూపించిందని చెప్పాడు. దేశం మొత్తాన్ని క్రీడల్లో మహిళా ప్రాతినిధ్యం పెంచేందుకు ప్రోత్సహించేలా సింధు ఆడిందని అన్నాడు. ఆమెను దేశం మొత్తం అభినందిస్తోందని, పతకం సాధించిన అనంతరం తమకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే మరింత ఉత్సాహం కలుగుతోందని, మరింత మంది క్రీడాకారులు తయారయ్యే పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయని, ఇంతకంటే ఇంకేం కావాలని అన్నాడు. ఒలింపిక్స్ లో అమ్మాయిలే మన పరువు నిలబెట్టారని ఆయన తెలిపాడు.

  • Loading...

More Telugu News