: దేవుడు దీవించాడు... కష్టం ఫలించింది: అచ్చతెలుగు ఆడపిల్లలా పీవీ సింధు


పట్టుపరికిణీలో పీవీ సింధు అచ్చతెలుగు ఆడపిల్లలా విజయవాడలో సందడి చేసింది. విజయవాడలో మీడియాతో సింధు మాట్లాడుతూ, దేవుడు తనను దీవించాడని తెలిపింది. ఇలాగే మరింత కాలం మంచి ప్రదర్శన ఇస్తానని విశ్వాసం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్ లో పతకం సాధించాలన్న కల నెరవేరిందని సింధు తెలిపింది. ఇందుకోసం చాలా కష్టపడ్డానని చెప్పింది. ఆ కష్టం రజత పతకం రూపంలో ఫలించిందని తెలిపింది. తన ఆటతీరు మరికొందరికి స్పూర్తిగా నిలిస్తే మంచిదని పేర్కొంది. తన వెన్నంటి నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్ కు ధన్యవాదాలు తెలిపింది. వారు లేకుంటే ఈ రోజు తానిలా ఉండేదానిని కాదని స్పష్టం చేసింది. తనను ఇంతదానిని చేసిన వారికి, తనకు సపోర్ట్ ఇచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపింది.

  • Loading...

More Telugu News