: బోయపాటి ఆధ్వర్యంలో పుష్కరాల ముగింపు వేడుకలు... ప్రత్యేక ఆకర్షణగా స్పెషల్ ఎఫెక్ట్స్, లేజర్ షో
కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకను ఘనంగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయవాడ పవిత్రసంగమం ఘాట్ వద్ద కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకలు జరగనున్నాయి. ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో పుష్కరాల ముగింపు వేడుకలు జరగనున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా స్పెషల్ ఎఫెక్ట్స్, లేజర్ షో ప్రదర్శించనున్నారు. ముగింపు వేడుకలకు రాజమండ్రి సమీపంలోని కడియం నుంచి పూలు, ఆస్ట్రేలియా నుంచి టపాసులను తెప్పించారు. హారతి వేదిక వెనుకభాగంలో బాణసంచా పేలుళ్లకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎంతో అట్టహాసంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. హారతి వేదిక వెనుకభాగంలో బాణసంచా పేలుళ్లకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. 50 పడవలు, 5 ఫంట్లుపై బాణసంచా పేలుళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.