: ‘రిలయన్స్ క్యాపిటల్’ బోర్డులోకి అనిల్ అంబానీ పెద్దకొడుకు
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ కుమారుడు అనుమోల్ అంబానీ ‘రిలయన్స్ క్యాపిటల్’ బోర్డులోకి అడిషనల్ డైరెక్టర్ గా ప్రమోట్ అయ్యారు. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఇరవై నాలుగేళ్ల అనుమోల్ ‘రిలయన్స్ క్యాపిటల్’లోని పలు వాణిజ్య ఫైనాన్షియల్ సర్వీసెస్ లో పనిచేశారు. 'రిలయన్స్ క్యాపిటల్’ బోర్డులో అనిల్ అంబానీ తర్వాత అదే కుటుంబానికి చెందిన వారిలో అనుమోల్ అంబానీ ఒక్కరే ఉండటం గమనార్హం. వచ్చే నెలలో జరగనున్న సంస్థ వార్షిక సాధారణ సమావేశం నాటికి అనుమోల్ పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ డైరైక్టర్ గా బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.