: ఏపీలో నయీం అనుచరుడు జగ్గిరెడ్డి దగ్గర వెయ్యి కోట్ల ఆస్తి ఉంది: నట్టి కుమార్


కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీం అనుచరుల లిస్టు పెరుగుతోంది. నయీం దందాలు నాలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నట్టు ఊహాగానాలు వినబడుతున్న నేపథ్యంలో ఏపీలో నయీం అనుచరులంటూ కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా జగ్గిరెడ్డి అనే నయీం అనుచరుడి గురించి సినీ నిర్మాత నట్టి కుమార్ చెప్పారు. జగ్గిరెడ్డి నయీం ప్రధాన అనుచరుడిగా యథేచ్ఛగా అరాచకాలకు తెగబడ్డాడని ఆయన ఆరోపించారు. జగ్గిరెడ్డిని సిట్ విచారిస్తే చాలా మంది జాతకాలు బయటపడతాయని ఆయన తెలిపారు. జగ్గిరెడ్డి వద్ద సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించి తనకు తెలిసిన వివరాలు సిట్ కు అందజేస్తానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News