: రణ్ బీర్ కపూర్ ను 'గెట్ లాస్ట్' అంటూ షాక్ ఇచ్చిన హీరోయిన్!


సినిమా నటులు కనపడితే చాలు, సమయం సందర్భం అవసరం లేదు. అభిమానం పేరుతో జనాలు ఎగబడి చూస్తారు. చాలామంది నటులు అలాంటి వారందర్నీ చిరాగ్గా ఓ చూపు చూసి వెళ్లిపోతారు. ఇలాంటి అనుభవాలు ఎందరో అభిమానులకు ఎదురవుతుంటాయి. కానీ, ఇలాంటి అనుభవం బాలీవుడ్ యువనటుడు రణ్ బీర్ కపూర్ కు కూడా ఎదురైంది. హాలీవుడ్ నటి, ఆస్కార్ అవార్డు విజేత నటాలీ పోర్ట్ మన్ ను రణ్ బీర్ కపూర్ ట్రిబెకా చిత్రోత్సవంలో చూశాడు. దగ్గరే ఉంది కదా, ఆమెతో ఓ మాట కలుపుదామని భావించాడు. దీంతో ఆమె వెనుక పరుగెత్తి 'ఐ లవ్ యువర్ వర్క్' అనబోయాడు. ఇంతలోనే అతని మాటలు అతని గొంతులో ఉండగానే ఆమె వెనక్కి చూసి కోపంతో 'గెట్ లాస్ట్' అని అరిచేసింది. దీంతో రణ్ బీర్ కపూర్ బిత్తరపోయాడు. ఈ విషయం చెప్పిన రణ్ బీర్, దీంతో తాను షాక్ తిన్నానని, అయితే ఆ క్షణంలో ఆమె ఎందుకో ఏడుస్తున్నట్టు అనిపించిందని అన్నాడు. అలాగే 'యే దిల్ హై ముష్కిల్' షూటింగ్ లో ఉండగా ఓ రోజు ప్రముఖ దర్శకుడు క్వింటిన్ టారెంటినోను చూశానని, ఫోటో ప్లీజ్ అనేంతలో ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోయారని రణ్ బీర్ తెలిపాడు. ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే, ఇలాంటి అనుభవాలు అభిమానులకే కాదు, తమకు కూడా ఎదురవుతుంటాయని రణ్ బీర్ అన్నాడు.

  • Loading...

More Telugu News