: రూ.100 కోట్లతో అపార్టుమెంట్ కొనుగోలు చేసిన కాంగ్రెస్ నేత కుమారుడు
ముంబయిలో రూ.100 కోట్ల విలువ చేసే త్రిబుల్ డూప్లెక్స్ అపార్టుమెంట్ ను కాంగ్రెస్ నేత, బీహార్ మాజీ గవర్నర్ డీవై పాటిల్ కుమారుడు అజింక్యా పాటిల్ దక్కించుకున్నాడు. వర్లి ప్రాంతంలో 23 అంతస్తుల భవనాన్ని ఇటీవల నిర్మించారు. అందులోని 21, 22, 23 అంతస్తుల్లోని త్రిబుల్ డూప్లెక్స్ అపార్టు మెంట్ కొనుగోలు నిమిత్తం అజింక్యా ఇంత పెద్దమొత్తం ఖర్చు చేశారు. ఆయనకు చెందిన ఏఐపీఎస్ రియల్ ఎస్టేట్ పేరుతో ఈ డూప్లెక్స్ అపార్టుమెంట్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అజింక్యా ఇంకా స్పందించలేదు. కానీ, ‘ఏఐపీఎస్’ సంస్థ అధికార ప్రతినిధి దిలీప్ కవాద్ మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించారు.