: రెజ్లర్ సాక్షిమాలిక్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై కేసు నమోదు
రియో ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తిపై కేసు నమోదైంది. సామాజిక మాధ్యమం ద్వారా సాక్షి మాలిక్ మతానికి వ్యతిరేకంగా నిందిత నెటిజన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, స్థానిక సోషల్ మీడియా గ్రూప్ ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేశామని, సైబర్ సెల్ ద్వారా దర్యాప్తు నిర్వహిస్తున్నామని చెప్పారు. నంబార్డర్ ఫేస్ బుక్ ప్రొఫైల్ ద్వారా ఆ నిందితుడు ఈ వ్యాఖ్యలు చేశాడని, పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్పారు. అయితే, సదరు నిందితుడు సమాజ్ వాదీ పార్టీ కార్యకర్త అని వస్తున్న ఆరోపణలను మీరట్ కు చెందిన ఆ పార్టీ నేత జైవీర్ సింగ్ ఖండించారు. అతనితో పార్టీకి ఎటువంటి సంబంధాలు లేవని చెప్పారు.